Thailand floods: థాయిలాండ్‌ను ముంచెత్తిన వరదలు.. 145 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్‌లో భారీ వర్షాలు, వరదలు తీవ్రమైన పరిస్థితులు సృష్టించాయి. దక్షిణ థాయిలాండ్‌లో ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 145 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఈ వరదల కారణంగా 12 లక్షలకంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి, వందల మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రహదారులు, ఇతర మౌలిక సౌకర్యాలు ధ్వంసమైన కారణంగా, సహాయక చర్యలు కొన్ని చోట్ల ఆలస్యం అవుతున్నాయి. అధికారులు సూచించిన విధంగా, మృతుల సంఖ్య ఇంకా పెరుగే అవకాశాలు ఉన్నాయి.యి
ట్విట్టర్ పోస్ట్ చేయండి
థాయిలాండ్‌ను ముంచెత్తిన వరదలు
Receding waters begin revealing devastating damage from floods in Thailand that have killed at least 145 people and affected millions. https://t.co/k6tFmVPFSE
— The Associated Press (@AP) November 28, 2025