
Russian President Putin: రష్యాలో జనన రేటు తగ్గుదల.. పెద్ద కుటుంబాలకు పుతిన్ ప్రాధాన్యత
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జనాభా పెంపు చర్యల్లో భాగంగా తన దేశ పౌరులను పని విరామ సమయంలో సహజీవనం చేయాలని కోరారు.
దేశంలో జననాల రేటు తగ్గుముఖం పట్టడంతో తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. రష్యాలో ప్రతి స్త్రీకి సగటుగా 1.5 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.
ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 భర్తీ రేటు కంటే చాలా తక్కువ. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, యువకులు పెద్ద సంఖ్యలో దేశం విడిచిపెట్టడం జనాభా తగ్గుదలలో కీలక పాత్ర పోషించింది.
రష్యన్ ప్రజల పరిరక్షణ తమ అత్యున్నత జాతీయ ప్రాధాన్యత అని పుతిన్ తెలిపారు.
Details
సంతానోత్పత్తిపై దృష్టి సారించాలి
ఈ సందర్భంగా, రష్యా ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ ఈ అంశంపై స్పందించారు. పనిలో బిజీగా ఉండటం సంతానోత్పత్తికి అడ్డంకి కాదని చెప్పారు.
పని విరామ సమయంలో సంతానోత్పత్తిలో నిమగ్నమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదే అంశంపై పుతిన్ గతంలో కూడా రష్యన్ మహిళలను ఎనిమిది మంది పిల్లలను కనాలని కోరిన విషయం తెలిసిందే.
పుతిన్ రష్యన్ కుటుంబ సంప్రదాయంలో పెద్ద కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చే సంప్రదాయం ఉందని, అదే దిశగా మరల కలిసిరావాలని పిలుపునిచ్చారు.
Details
జనన రేటు తగ్గుదలపై రష్యా కీలక ప్రకటన
జనన రేటు తగ్గుదల రష్యా భవిష్యత్తుకు ఒక పెద్ద సవాలుగా మారింది.
2024 మొదటి అర్ధభాగంలో రష్యాలో 599,600 మంది పిల్లలు జన్మించగా, 2023లో ఇదే కాలానికి 16,000 మంది తక్కువగా జన్మించారు.
దీంతో జనాభా సహజ క్షీణతలో వేగం పెరిగిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.