LOADING...
Us-China: ఇరాన్‌కు సహాయం చెయ్యదని చైనాకు అమెరికా వార్నింగ్.. ట్రంప్‌ టీమ్‌కు బీజింగ్ హామీ?
ట్రంప్‌ టీమ్‌కు బీజింగ్ హామీ?

Us-China: ఇరాన్‌కు సహాయం చెయ్యదని చైనాకు అమెరికా వార్నింగ్.. ట్రంప్‌ టీమ్‌కు బీజింగ్ హామీ?

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య చైనా పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌కు ఎలాంటి భౌతిక సహాయం అందించబోమని చైనా ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హామీ ఇచ్చారని అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. ట్రంప్ ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ఈ హామీ లభించిందని ఆయన తెలిపారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేపట్టే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రీర్ మాట్లాడుతూ.. ట్రంప్ చైనా నేతలతో సమావేశమైనప్పుడు హోర్ముజ్ జలసంధిలో చర్యలు తీసుకోవాలని కోరలేదన్నారు. అయితే ఇరాన్‌కు ఎలాంటి సైనిక లేదా ఇతర సహాయం అందించవద్దనే విషయాన్ని స్పష్టంగా చెప్పారని తెలిపారు.

వివరాలు 

ఇరాన్‌కు చైనా అత్యంత కీలకమైన మిత్రదేశం

ఈవిషయంలో చైనా నుంచి హామీ కూడా పొందినట్లు చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో చైనాతో కలిసి సైనిక చర్యలు చేపట్టాలనే ఉద్దేశం అమెరికాకు లేదని,కానీ తమ చర్యలకు చైనా అడ్డంకిగా మారకూడదని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌కు చైనా అత్యంత కీలకమైన మిత్రదేశంగా భావించబడుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు కొనుగోళ్లలో చైనాదే ప్రధాన పాత్ర. పాశ్చాత్య ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ చైనా భారీగా ఇరాన్ చమురును కొనుగోలు చేస్తోంది. అంతేకాదు ఆర్థిక లావాదేవీలు,షిప్పింగ్ వ్యవస్థల ద్వారా కూడా చైనా ఇరాన్‌కు మద్దతు ఇస్తోందని అమెరికా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాల సరఫరా జరిగే అవకాశం ఉందని సిఎన్‌ఎన్ నివేదిక వెల్లడించగా..అప్పట్లో ట్రంప్ చైనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు చైనా పరోక్షంగా మధ్యవర్తిత్వం

ఇక అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు చైనా పరోక్షంగా మధ్యవర్తిత్వం వహిస్తోందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇరాన్‌ను చర్చల బల్లపైకి తీసుకురావడంలో చైనా కీలక పాత్ర పోషించిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చైనా అధికారికంగా స్పందించలేదు. కానీ "శాంతి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం" అని మాత్రం ప్రకటించింది. ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి చైనా పర్యటనకు వెళ్లి విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు.

Advertisement

వివరాలు 

దాడులు ప్రారంభించేందుకు సైనిక ప్రణాళికలు సిద్ధం చేసిన అమెరికా

మరోవైపు అమెరికా గూఢచార సంస్థల నివేదికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే కొన్ని వారాల్లో చైనా కొత్త వైమానిక రక్షణ వ్యవస్థలను ఇరాన్‌కు పంపించే అవకాశం ఉందని సిఎన్‌ఎన్ వెల్లడించింది. ఈ సరఫరాలను మూడో దేశాల ద్వారా పంపే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఇదే సమయంలో ఇరాన్‌పై తదుపరి చర్యలపై ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. అవసరమైతే మళ్లీ దాడులు ప్రారంభించేందుకు పెంటగాన్ ఇప్పటికే సైనిక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది.

Advertisement