
Vladimir Putin: పుతిన్‌కు 'మినీ-స్ట్రోక్' వచ్చిందా? మాజీ స్పీచ్‌రైటర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మాజీ క్రెమ్లిన్ స్పీచ్‌రైటర్ అబ్బాస్ గల్యామోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ మొదటి రెండు పదవీకాలాల్లో (2008 వరకు) ఆయనకు ప్రసంగాలు గల్వామోవ్ ప్రసంగాలు రాశారు.
ఇప్పటికే రెండు సంవత్సరాల కిందటే పుతిన్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆయన చెప్పారు.
Details
పుతిన్‌కు మినీ-స్ట్రోక్ వచ్చిందా?
డైలీ ఎక్స్‌ప్రెస్ తో గల్యామోవ్ మాట్లాడుతూ, "పుతిన్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.
గతంలో పుతిన్‌కు క్యాన్సర్, పార్కిన్సన్ వంటి వ్యాధులు ఉన్నాయంటూ రకరకాల వార్తలు వెలువడ్డాయి.
అయితే 2022లో పుతిన్ వ్యవహారశైలి చూస్తే క్యాన్సర్ కంటే మినీ-స్ట్రోక్ లక్షణాలే ఎక్కువగా కనిపించాయని ఆయన అన్నారు.
2022లో ఉక్రెయిన్‌పై దాడి అనంతరం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో పుతిన్ సమావేశమైనప్పుడు, ఆయన శరీరం వణకడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ ఫుటేజీలో పుతిన్ గట్టిగా నడుస్తూ, శరీరం కంపించడం స్పష్టంగా కనిపించింది.
Details
2022లో ఏం జరిగింది?
అప్పట్లో ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇదే క్రమంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా వెలుగులోకి వచ్చింది. పుతిన్ నిజంగా బ్రతికే ఉన్నారా? లేదంటే బాడీ డబుల్స్ వాడుతున్నారా? అనే చర్చ మొదలైంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తన దేశం బలహీనంగా కనిపించకూడదనే ఉద్దేశంతో రష్యా అధినాయకత్వం పుతిన్ బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తోందన్న వార్తలు కొన్ని మీడియాలో ప్రచారం అయ్యాయి.
అయితే, దీనికి స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు. ఇప్పటికీ పుతిన్ ఆరోగ్యం గురించి స్పష్టత రాలేదు.
అయితే, గతంలో వచ్చిన అనేక వీడియోలు, నడకలో వచ్చిన మార్పులు, అతని శరీరం వణుకడం చూస్తే ఆయన ఆరోగ్యంపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.