LOADING...
H-1b Visa: ఐటీ రంగానికి ఆందోళన, కీలక రంగాలకు ఊరట.. హెచ్-1బీ వీసా ఫీజు మినహాయింపు
ఐటీ రంగానికి ఆందోళన, కీలక రంగాలకు ఊరట.. హెచ్-1బీ వీసా ఫీజు మినహాయింపు

H-1b Visa: ఐటీ రంగానికి ఆందోళన, కీలక రంగాలకు ఊరట.. హెచ్-1బీ వీసా ఫీజు మినహాయింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఒక లక్షడాలర్ల ఫీజు విధించడం మన దేశ ఐటీ రంగానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నూతన నియమం ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చింది.ఈ చర్యకు సంబంధించి ట్రంప్‌ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. ఈలోపు అమెరికా కాంగ్రెస్‌లో చట్టం ఆమోదం పొందితే,ఆ తర్వాత అది శాశ్వతంగా అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం భారతీయ ఉద్యోగులు హెచ్-1బీ వీసాతో అమెరికాకు వెళ్లినప్పుడు వార్షిక వేతనం సగటున 60,000 నుండి 1,40,000డాలర్ల మధ్య ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు కంపెనీలు భరించడం కష్టమని భావిస్తున్నారు.

వివరాలు 

అమెరికా ప్రాధాన్యతలకు అనుగుణంగా 

అందువల్ల ఈ ఫీజులో ఎవరైనా మినహాయింపుకు అర్హులవుతారా అనే ప్రశ్న ముందుకొస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం,అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా కీలక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రంగాలకు ఫీజు మినహాయింపు అవకాశం కల్పించారు. ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లోని సెక్షన్‌ 1(సి)లో ఈ మినహాయింపుల ప్రస్తావన ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శికి ఉంటుంది. ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఎవరికి మినహాయింపు ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించవచ్చు. ముఖ్యంగా అత్యుత్తమ నైపుణ్యం గలవారిని అమెరికాకు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైద్యులు, మెడికల్‌ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.

వివరాలు 

మినహాయింపు పొందే అవకాశమున్న రంగాలు 

వీరితో పాటు మరికొన్ని రంగాల్లో ఉన్న ప్రావీణ్యం కలిగిన ఉద్యోగులు కూడా ఈ ఫీజు నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వైద్యులు (ఫిజీషియన్లు) వైద్య, ఆరోగ్య పరిశోధనలు రక్షణ,జాతీయ భద్రత స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌) రంగాల పరిశోధనలు ఇంధన రంగం విమానయానం సైబర్‌ సెక్యూరిటీ ఈ రంగాల్లో పనిచేసే నిపుణులకు తక్షణ ప్రత్యామ్నాయం దొరకడం అసాధ్యం. అంతేకాక, వీరికి శిక్షణ ఇచ్చి సానబెట్టడం కూడా తేలికైన పని కాదు. అందువల్ల ఈ రంగాలకు చెందిన కంపెనీలు వీసా ఫీజు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.