LOADING...
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రత్యక్షం.. వార్ రూమ్‌లో ఎంట్రీపై సందేహాలు, ఏఐ వీడియోనా?
వార్ రూమ్‌లో ఎంట్రీపై సందేహాలు, ఏఐ వీడియోనా?

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రత్యక్షం.. వార్ రూమ్‌లో ఎంట్రీపై సందేహాలు, ఏఐ వీడియోనా?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ యుద్ధ పరిస్థితులు చివరి దశకు చేరాయా? ఆ దేశ సుప్రీం నేతగా భావిస్తున్న ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఎక్కడ ఉన్నారు? గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నలు చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఆ వీడియో నిజమా? లేక ఏఐ సాయంతో రూపొందించిందేనా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఎట్టకేలకు ప్రత్యక్షమైన మొజ్తబా ఖమేనీ

యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి ప్రజలకు కనిపించని మొజ్తబా ఖమేనీ, చివరికి వీడియో రూపంలో దర్శనమిచ్చారు. ఇంతకుముందు రెండు సందర్భాల్లో ఆయన ఆడియో సందేశాలను మాత్రమే ఇరాన్ టీవీ విడుదల చేసింది. అయితే ఈసారి ఆయన ప్రత్యక్షంగా కనిపించే వీడియో బయటకు రావడం విశేషంగా మారింది. ఈ వీడియోలో మొజ్తబా ఖమేనీ నేరుగా వార్ రూమ్‌లోకి ప్రవేశించినట్టు కనిపిస్తోంది. ఆయనను చూసిన సైనిక అధికారులు గౌరవంగా నిలబడ్డారు. కమాండ్ సెంటర్‌లో ఇజ్రాయెల్ డిమోనా అణు స్థావరం మ్యాప్ ముందు నిలబడి, అధికారులతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తున్నట్టు వీడియోలో భావన కలుగుతోంది.

వివరాలు 

డిమోనా అణు కేంద్రం చుట్టూ ఉద్రిక్తత

డిమోనా అణు కేంద్రంగా ప్రసిద్ధి చెందిన షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రం, ఇజ్రాయెల్ దక్షిణ ఎడారి ప్రాంతంలో ఉంది. ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి దాడి జరిగితే ప్రతిస్పందనగా డిమోనా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని సంకేతాలు ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. మార్చి నెలలో డిమోనా సమీపంలో ఇరాన్ క్షిపణి దాడి జరిపిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అణు కేంద్రానికి పెద్దగా నష్టం వాటిల్లినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగే అణు సౌకర్యాల భద్రతపై జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Advertisement

వివరాలు 

వీడియోపై అనుమానాలు.. ఏఐ పాత్ర?

ఇంతవరకు జరిగిన పరిణామాల మధ్య మొజ్తబా ఖమేనీ వీడియో బయటకు రావడం కొత్త చర్చకు దారితీసింది. ఈ వీడియోను GBX_Press అనే ఎక్స్ (X) ఖాతా ద్వారా విడుదల చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా, IRGC ఛానెల్స్ లేదా ఖమేనీ అధికారిక ఖాతా నుంచి ఇంకా ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఇక టెక్నాలజీ విశ్లేషణల ప్రకారం, ఈ వీడియో 100 శాతం ఏఐ ద్వారా రూపొందించబడిందని గ్రోక్ పేర్కొంటోంది. దీంతో వీడియో నిజానిజాలపై మరింత అనుమానం పెరిగింది. మొత్తంగా మొజ్తబా ఖమేనీ వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలిసారి వార్ రూంలో ప్రత్యక్షమైన ఇరాన్ సుప్రీం లీడర్

Advertisement