Page Loader
Donald Trump: 'ఆ బాంబులను వేయొద్దు'.. ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు!
'ఆ బాంబులను వేయొద్దు'.. ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు!

Donald Trump: 'ఆ బాంబులను వేయొద్దు'.. ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య జరుగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కుదిరినా ఇరుదేశాలూ పరస్పరం దాడులకు పాల్పడడం ఆయన మండిపడ్డారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 'ఇజ్రాయెల్‌... ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘన అవుతుంది. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి' అని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

Details

ఇజ్రాయెల్ చర్య పట్ల సంతృప్తిగా లేను

ఇజ్రాయెల్‌ తరఫున ఇరాన్‌పై ఇటీవలే దాడులకు అనుమతించిన ట్రంప్‌.. గత రెండు వారాలుగా మిత్రదేశానికి ఇంతకఠిన హెచ్చరికలు ఇవ్వడం ఇదే ప్రథమం. ది హేగ్‌లో జరగనున్న నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్‌, కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలూ మళ్లీ దాడులకు పాల్పడిన విషయాన్ని ధ్రువీకరించారు. 'ఇరాన్‌తోపాటు ఇజ్రాయెల్‌ కూడా కాల్పుల విరమణ ఉల్లంఘనకే పాల్పడింది. ఇజ్రాయెల్‌ చర్య పట్ల నేను సంతృప్తిగా లేను. టెల్‌ అవివ్‌ శాంతించాలి. అదే నేను కోరుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు.