Page Loader
Donald Trump: ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల ఆఫర్ పై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ!
ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల ఆఫర్ పై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ!

Donald Trump: ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల ఆఫర్ పై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అణు కార్యక్రమాన్ని నిలిపే ప్రతిఫలంగా ఇరాన్‌కు భారీ ఆర్థిక ప్యాకేజీని అందించాలన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఆఫర్లేవీ తమవైపు నుంచి ఇవ్వలేదని స్పష్టంగా తేల్చేశారు. ఈ వార్తలు వాస్తవం కాదని ఆయన కొట్టిపారేశారు. ఈ అంశంపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన 'ట్రూత్‌'లో స్పందిస్తూ, 'ఇరాన్‌కు ఎలాంటి ఆఫర్లు ఇవ్వడం లేదు. డెమొక్రాట్‌ సెనెటర్‌ క్రిస్ కూన్స్‌కు ఈ విషయం చెప్పండి. గతంలో జేసీపీవోఏ ఒప్పందం కింద బిలియన్ల డాలర్లు ఇరాన్‌కు ఇచ్చిన విధంగా ఇప్పుడు మళ్లీ చేయం. అప్పుడు వాళ్లకు డబ్బులు ఇచ్చి అణుబాంబుల అభివృద్ధికి అవకాశం కల్పించారు.

Details

ఆర్థిక సాయం గురించి ఎప్పుడూ చెప్పలేదు

30 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం గురించి నేను ఎప్పుడూ వినలేదు కూడా అని చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ఇవ్వాలన్న యోచనలో ఉందని పేర్కొంది. పౌర అవసరాల కోసం మాత్రమే అణుశక్తిని వినియోగిస్తామని ఇరాన్ అంగీకరిస్తే, నిషేధాలు తొలగించి, ఆర్థిక పరంగా సహాయం చేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తోందని పేర్కొంది. అమెరికాతో మళ్లీ చర్చలు జరగాలంటే తమపై భవిష్యత్తులో దాడులు చేయబోమన్న హామీ అమెరికా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వ అధికారి స్థాయిలో మధ్యవర్తుల ద్వారా తమకు సందేశాలు వస్తున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మాజిద్ తక్త్ రావంచి బీబీసీకి వెల్లడించారు.