Donald Trump: భారత్‌తో సహా అన్ని దిగుమతులపై 15శాతం సుంకాలను పెంచిన డొనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించిన ప్రకారం, ప్రపంచ దేశాలపై ఇప్పటికే విధించిన 10% సుంకాలను 15%కు పెంచుతున్నారు. ఈ నిర్ణయం, అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల విడుదల చేసిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు ట్రంప్ వెల్లడించిన ప్రకారం, వాణిజ్య, చట్టపరమైన ఇతర మార్గాల్లో మరిన్ని సుంకాలు కూడా అమల్లోకి తేవనున్నట్టు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ స్పందన శుక్రవారం సుప్రీంకోర్టు అదనపు సుంకాలను రద్దు చేసింది. ట్రంప్ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్, జాతీయ భద్రత సుంకాలను 10%కి పెంచారు. మరునాడు, ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టి వాటిని 15%కి పెంచినట్టు ప్రకటించారు.
Details
తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటన
అమెరికా సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన అమెరికా వ్యతిరేక, హాస్యాస్పద తీర్పును లోతుగా సమీక్షించిన తర్వాత, దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటూ వస్తున్న ప్రపంచ దేశాలపై 10% టారిఫ్‌ను 15%కి పెంచుతున్నాను. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. కొంతమేరలో మరిన్ని చట్టపరమైన టారిఫ్‌లు కూడా అమలు చేస్తాము. చట్టపరమైన ఆధారం అమెరికా వాణిజ్య చట్టం-1974, సెక్షన్ 122 : అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై గరిష్టంగా 15% టారిఫ్ విధించే అధికారం ఉంది. ట్రంప్ శుక్రవారం 10% సుంకాలను ఈ సెక్షన్ ఆధారంగా అమలు చేశారు. శనివారం పూర్తి అధికారం వినియోగించి 15%కి పెంచారు.
Details
ఇతర చట్టాధారాలు
సెక్షన్ 201, 301 (1974 చట్టం) సెక్షన్ 338 (టారిఫ్‌ల చట్టం) సెక్షన్ 232 (వాణిజ్య విస్తరణ చట్టం-1962) కానీ, వీటిని వర్తింపజేయడానికి అధ్యయనాలు, పరిశీలనలు, వ్యాపారాలపై ప్రభావం నిర్ధారణ వంటి ప్రక్రియలు అవసరం. ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలపై భారత్ సహా అన్ని దేశాల దిగుమతులపై సుంకాలు తాత్కాలికంగా 15%కి పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాల టారిఫ్ శాతాలు తాత్కాలికంగా 15%కి మారుతాయి ఉదాహరణ: భారత వస్త్రాలపై పాత టారిఫ్ 7-9% ఉంటే, ఇప్పుడు 15% అవుతుంది. ఉక్కు, అల్యూమినియం (50%), కొన్ని వాహన భాగాల (25%) ప్రత్యేక టారిఫ్‌లు యధావిధిగా కొనసాగుతాయి. సుప్రీంకోర్టు అదనపు సుంకాలను రద్దు చేసినప్పటికీ, 2026లో టారిఫ్ ఆదాయం మా అంచనాల ప్రకారం సమకూరుతుంది.
Details
కేంద్ర వాణిజ్యశాఖ స్పందన ఇదే
అదనపు సుంకాలపై సుప్రీంకోర్టు తీర్పు, తర్వాత ట్రంప్ స్పందనను గమనించి, ఈ అంశాలపై పరిణామాలను అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్‌లు ఇప్పుడు 15% స్థాయిలో ఉంటాయి. అదనపు టారిఫ్‌లు, కొత్త చట్టపరమైన విధానాలు కొంతమేరలో ప్రవేశపెడతారు. భారత్ సహా, ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు ఉన్నా, తాత్కాలికంగా 15% సుంకాలు వర్తిస్తాయి.