Biden-Trump: వైట్ హౌస్ వేదికగా జో బైడెన్‌తో.. డోనాల్డ్ ట్రంప్ భేటీ
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత బుధవారం (నవంబర్ 13) తొలిసారిగా వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా, అమెరికా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సాఫీగా అధికార బదిలీ జరగాలనే సంకల్పాన్ని ఇరువురు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో, వచ్చే జనవరి 20న స్మూత్ ట్రాన్సిఫర్ జరగాలని వీరు ధృవీకరించారు. ట్రంప్‌ను హృదయపూర్వకంగా స్వాగతించిన బైడెన్, ట్రంప్ కి అభినందనలు తెలిపారు. బైడెన్‌కు ట్రంప్ కూడా తన ధన్యవాదాలు తెలియజేశారు.
మధ్యప్రాచ్య సమస్యలపైన బిడెన్, ట్రంప్ చర్చ
ఈ సమావేశంలో, బైడెన్ కొన్ని అభ్యర్థనలను ట్రంప్‌తో చర్చించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ప్రకారం, గాజాలో ఉన్న అమెరికన్ బందీల గురించి వారు మాట్లాడారు. బందీలను విముక్తి చేయడానికి సహకరించేందుకు ట్రంప్ నాయకత్వ బృందం సిద్ధంగా ఉందని సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. బందీ కుటుంబాలు బైడెన్‌ను కలిసినప్పుడు, వారు ఈ విషయంలో ప్రభుత్వ సహకారం కోరారు. గాజాలోని బందీలను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కోసం ట్రంప్ తన ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ అంశంపై మధ్యప్రాచ్య సమస్యలపైన తాను, ట్రంప్ చర్చించారని బైడెన్ చెప్పారు. తన అభిప్రాయాలను ట్రంప్ స్పష్టంగా వివరించినట్లు తెలిపారు.
అమెరికన్ బందీల విషయంలో గట్టి హెచ్చరికలు
రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ ప్రసంగిస్తూ, అమెరికన్ బందీల విషయంలో గట్టి హెచ్చరికలు చేశారు. ఇప్పటికే చాలా మంది బందీలుగా ఉన్నవారు సజీవంగా లేరని పునరుద్ఘాటించారు. గాజాలోని అమెరికన్ బందీలను తిరిగి తీసుకురావడం అనేది అమెరికా, ట్రంప్ కోసం గౌరవం పెంపొందించేదిగా మారుతుంది.