LOADING...
Donald Trump : గ్రహాంతర వాసుల ఫైళ్లు బయటపెడతా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
గ్రహాంతర వాసుల ఫైళ్లు బయటపెడతా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump : గ్రహాంతర వాసుల ఫైళ్లు బయటపెడతా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఏలియన్స్‌కు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను గుర్తించి ప్రజలకు విడుదల చేసేలా ఫెడరల్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో గ్రహాంతర వాసుల అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా అనేక మంది అమెరికన్లు తమ ప్రభుత్వం వద్ద గ్రహాంతర జీవులపై ఉన్న సమాచారం తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే వాటికి సంబంధించిన ముఖ్యమైన, ఆసక్తికరమైన వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

Details

ఒబామా చేసిన వ్యాఖ్యలు ఇవే!

ఇటీవల జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో ఒబామా గ్రహాంతర వాసుల ఉనికి గురించి మాట్లాడిన తీరు సరైంది కాదని ట్రంప్ విమర్శించారు. అయితే ఒబామా వెల్లడించిన రహస్య విషయమేంటన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతవారం ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన బరాక్ ఒబామా, విశ్వంలోని ఎక్కడో ఒక గ్రహంపై గ్రహాంతర జీవులు ఉండే అవకాశాన్ని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. అయితే ఏలియన్లను అమెరికాలోని నెవాడ రాష్ట్రంలో ఉన్న అత్యంత రహస్య ప్రదేశం Area 51లో యూఎస్ ప్రభుత్వం నిర్బంధించి ఉంచిందనే ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

Details

తన వద్ద ఎలాంటి సమాచారమూ లేదు

గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ప్రత్యేక రికార్డులు అమెరికా ప్రభుత్వ వద్ద ఉన్నాయని తనకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తనకు తెలిసినంతవరకు ఏరియా 51లో ఎటువంటి భూగర్భ కేంద్రాలు లేవని, ఒకవేళ ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ఒబామా పేర్కొన్నారు.

Advertisement