Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో ఝలక్... ఎన్నికలకి అనర్హుడని మైనే నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా క్యాపిటల్ హిల్‌పై దాడి వ్యవహారం కేసు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్'ను వెంటాడుతోంది.
2021లో జో బైడెన్ విజయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్'పై దాడికి పాల్పడినట్లు కోర్టు నిర్థారించింది.
ఈ మేరకు 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్'ను మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించింది.
ఇప్పటికే కొలరాడోకి చెందిన న్యాయస్థానం ఆయనపై నిషేధాన్ని విధించింది.తాజాగా మైనే ఎన్నికల అధికారి నిర్ణయంతో ట్రంప్ పోటీకి రెడ్ సిగ్నల్ పడింది.
details
పోటీకి ట్రంప్ అనర్హుడు
దీంతో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ (Republican Party) నుంచి తన రాష్ట్రంలో పోటీ చేసేందుకు అనర్హుడయ్యారు.
2021లో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి కేసులో భాగంగా న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. తీర్పుపై జనవరి 4వరకు స్టే విధించారు.
అనర్హత పడకుండా ఉండేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మాజీ అధ్యక్షుడి లీగల్ టీం ప్రయత్నాలు వేగవంతం చేసింది.
కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్రానికే పరిమితమవుతుంది. కానీ మిగతా రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు.
వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ మరోసారి కొలరాడో నుంచి బరిలో దిగనున్నారు.
కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్రమే తాజా తీర్పు వర్తిస్తున్న కారణంగా కోర్టు తీర్పు ట్రంప్ అభ్యర్థిత్వంపై ప్రభావం చూపనుంది.