Trump: 8,9 ఏండ్లు వైట్‌హౌస్‌లోనే ఉంటా..మూడోసారి కుర్చీపై కన్నేసిన ట్రంప్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి కూడా తానే కొనసాగాలని ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. వైట్‌హౌస్‌లో ఇంకా ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు కొనసాగుతానని, ఇది సరదాగా చెప్పిన మాట కాదని స్పష్టం చేశారు. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకంటే ఎక్కువసార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సాధ్యం కాదు. అయినప్పటికీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా మూడోసారి బాధ్యతలు చేపట్టాలనే తన అభిలాషను 2025లోనే ఆయన వ్యక్తం చేశారు. దీనికి రాజ్యాంగంలో కొన్ని మార్గాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
వివరాలు
జోక్ చేయట్లేదు: అధ్యక్షుడు ట్రంప్
ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన వ్యాపార సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇప్పటి నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు వైట్‌హౌస్‌లోనే ఉంటానని, బయటకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. ఇది సరదాగా చెప్పిన మాట కాదని, ఈ కాలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటానని అన్నారు. ఇంకా దేశ పాలనలో ఇది కేవలం ఆరంభ దశ మాత్రమేనని, ముందుకు చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.