Meloni ally: 'భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలు చెబుతారా?'.. రాహుల్ వ్యాఖ్యలపై మెలోనీ మిత్రపక్షం ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రజాస్వామ్యంపై యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ ప్రధాన కార్యదర్శి జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు ఇటలీలో రాజకీయ దుమారం రేపాయి. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్న భారత్‌కు యూరోపియన్ నేతలు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి చెందిన మిత్రపక్షం ఫోర్జా ఇటాలియా నేత డెబోరా బెర్గామిని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేసే ముందు దేశంలోని రాజకీయ వ్యవస్థలు, సంస్థల గురించి తెలుసుకోవాలని సూచించారు. నవంబర్ 14న హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ 2026లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి జియాకోమో ఫిలిబెక్ వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
ఫిలిబెక్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బెర్గామిని
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నినాదమైన 'ఓట్ చోర్.. గద్దీ ఛోడ్' అంటూ విమర్శలు చేశారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని అంతర్జాతీయ రాజకీయ శక్తులకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఫిలిబెక్ వ్యాఖ్యలపై డెబోరా బెర్గామిని తీవ్రంగా స్పందించారు. భారత్‌కు సొంత రాజకీయ వ్యవస్థలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్నాయని గుర్తుచేశారు.
దేశ ఎన్నికల ప్రక్రియపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని, అయితే అలాంటి ఆరోపణలు చేసేవారు అందుకు తగిన ఆధారాలను కూడా చూపించాలని అన్నారు.
మిత్రదేశమైన భారత్ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో ఇతర దేశాల రాజకీయ ప్రతినిధులు జోక్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
వివరాలు
భారత్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు: అమిత్ షా
భారత్, ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని బెర్గామిని పేర్కొన్నారు.
రక్షణ, వాణిజ్యం సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని గుర్తుచేశారు.
భారత ప్రజాస్వామ్యంపై ఎలాంటి వివాదాలు,అభ్యంతరాలు ఉన్నా వాటిని దేశంలోని సంబంధిత సంస్థలు, న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
మరోవైపు ఈ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు.
విదేశీ వేదికలపై భారత్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
విదేశీ పర్యటనలు చేయడం మానుకుని భారత గ్రామాల్లో పర్యటించాలని ఆయనకు సూచించారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తేనే ప్రజల సమస్యలు అర్థమవుతాయని, అలా చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారు.