Page Loader
Liverpool Team: లివర్‌పూల్ ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ విక్టరీ పరేడ్‌లోకి దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు
లివర్‌పూల్ ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ విక్టరీ పరేడ్‌లోకి దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు

Liverpool Team: లివర్‌పూల్ ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ విక్టరీ పరేడ్‌లోకి దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
07:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు ఆనందోత్సవాలు.. మరోవైపు హాహాకారాలు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో అక్కడి ప్రజలంతా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌ నగరంలో చోటుచేసుకుంది.ప్రీమియర్ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ చేజిక్కించుకుంది. దీంతో మాంచెస్టర్ యునైటెడ్ జట్టుతో సమాన స్థాయిలో నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని లివర్‌పూల్ నగరంలో భారీగా సెలబ్రేషన్లు జరిగాయి. ఈ నేపథ్యంలో, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసే ఉద్దేశంతో లివర్‌పూల్ జట్టు ఒక ఘనమైన పరేడ్‌ నిర్వహించింది.

వివరాలు 

వాహనదారుడి అరెస్ట్ 

ఈ పరేడ్‌ జరిగిన సమయంలో, సిటీ సెంటర్‌లో పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మిగూడారు. ఇదే సమయంలో, ఓ దుండగుడు కారుతో దూసుకొచ్చాడు. అతను నియంత్రణ లేకుండా కారును నడిపి, పలువురు వ్యక్తులను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. దీనిపై స్పందించిన స్థానిక పోలీసులు, ఆ వాహనదారుడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఘటనకు సంబంధించిన వీడియో