LOADING...
Iran : అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనపై ఇరాన్‌లో ఆందోళనలు
అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనపై ఇరాన్‌లో ఆందోళనలు

Iran : అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రతిపాదనపై ఇరాన్‌లో ఆందోళనలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 14, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో కుదరబోయే ఒప్పందంపై ఇరాన్ ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రదర్శిస్తోందన్న నేపథ్యంలో, దేశంలోని పలువురు పౌరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మషద్ నగరంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట గుమికూడిన నిరసనకారులు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే అరాగ్చీతో పాటు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వివరాలు

అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు..

ఈ ఒప్పందం అమలులోకి వస్తే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని, హర్మూజ్ జలసంధిపై టెహ్రాన్‌కు ఉన్న ప్రభావం, నియంత్రణ బలహీనపడే ప్రమాదం ఉందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ, లెబనాన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతో ఒక ప్రాథమిక ఒప్పందంపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

వివరాలు

వందలాది మంది నిరసన..

హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నప్పటికీ, అందుకు ప్రతిగా ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా అమలు చేస్తున్న నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనే నిబంధనను ఒప్పందంలో చేర్చినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రకటనల అనంతరం వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు.

Advertisement