Loading...
USA-Iran War: అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రం.. ఖేష్మ్, బుషెహర్‌పై వైమానిక దాడులు
అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రం.. ఖేష్మ్, బుషెహర్‌పై వైమానిక దాడులు

USA-Iran War: అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రం.. ఖేష్మ్, బుషెహర్‌పై వైమానిక దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా చేపడుతున్న వరుస సైనిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్‌లో ఉన్న తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు జరపడంతో వాటికి ప్రతిస్పందనగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఈ సందర్భంగా''దాడులకు తగిన రీతిలో గట్టి సమాధానం ఇస్తాం''అని హెచ్చరించారు. అనంతరం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఖేష్మ్ ద్వీపంతో పాటు అణువిద్యుత్ కేంద్రానికి ప్రసిద్ధి చెందిన తీర నగరం బుషెహర్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది.

వివరాలు 

దౌత్య చర్చలు జరుగుతున్నాయన్న ఆశలు అడుగంటిపోతున్నాయి

ఖేష్మ్ ద్వీపంలోని నివాస ప్రాంతాలపై కూడా క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ దాడుల అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.

ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో ప్రారంభమైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య ఘర్షణలు కొంతకాలం మాత్రమే తగ్గుముఖం పట్టాయి.

అయితే అవగాహన ఒప్పందాన్ని పక్కనపెట్టి, ఇటీవల పదిరోజులకు పైగా ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి భారీ దాడులు జరిపాయి.

ఆ తర్వాత కొద్దిరోజులు ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ, తాజాగా మళ్లీ దాడులు ప్రారంభం కావడంతో శాంతి చర్చలపై నెలకొన్న ఆశలు మరింత మందగిస్తున్నాయి.

వివరాలు 

ఈజిప్ట్ పోర్టులో గ్యాస్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారీ అగ్నిప్రమాదం

ఇరాన్, గల్ఫ్ దేశాలకే పరిమితమైన ఘర్షణలు తాజాగా మరో కీలక మలుపు తిరిగాయి.

బుధవారం ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనతో ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దాడి సమయంలో పోర్టులో ఎల్‌ఎన్‌జీ లోడింగ్‌తో పాటు ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

డ్రోన్ దాడి అనంతరం ట్యాంకర్‌లో భారీగా మంటలు చెలరేగగా, అవి వేగంగా సమీపంలో ఉన్న మరో గ్యాస్ ట్యాంకర్‌కు కూడా వ్యాపించాయి.

దీంతో పోర్టు పరిసరాల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT

వివరాలు 

ఈజిప్ట్ పోర్టులో గ్యాస్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారీ అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం తీవ్రత దృష్ట్యా అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి నావికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఇంధన నిల్వలు, ఎల్‌ఎన్‌జీ ఎగుమతులకు కీలకమైన దేశమైన ఈజిప్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశంపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిణామంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందనే చర్చలు కూడా ఊపందుకున్నాయి.

ADVERTISEMENT