Page Loader
ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్ 
ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్

ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్ 

వ్రాసిన వారు Stalin
Jul 18, 2023
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకే ఒక్క అక్షర దోషం అమెరికా మిలిటరీకి తీవ్ర తలనొప్పిగా మారింది. అక్షర దోషం కారణంగా లక్షలాది అమెరికా మిలిటరీ ఇమెయిల్‌లు సంవత్సరాలుగా రష్యా మిత్రదేశమైన 'మాలి'కి లీక్ అవుతున్నాయి. అమెరికాలో మిలిటరీ తమ మధ్య కమ్యూనిషేన్‌ కోసం .MIL అనే ఈమెయిల్ డొమైన్‌ను వాడుతుంది. అయితే సైన్యంలోకి కొందరు అధికారులు .MILకి బదులుగా .ML అని తప్పుగా టైప్ చేశారు. .ML అనేది రష్యా మిత్రదైశమైన మాలి డొమైన్ కావడంతో ఆమెరికా మిలటరీ ఒక్కసారి ఉలిక్కిపడింది. పదేళ్లుగా 1,17,000ఈమెయిల్స్‌ను అమెరికా ఆర్మీ అధికారులు మాలికి చెందిన .MLడొమైన్‌కు పంపారు. సైన్యం పాస్‌వర్డ్‌లు, ఉన్నత అధికారుల పర్యటనల వివరాలు, హోటల్ గదులు నెంబర్స్ వంటి సున్నితమైన సమాచారం ఆ ఈమెయిల్స్‌లో ఉంటడం గమనార్హం.

ఆమెరికా

ఎలా వెలుగులోకి వచ్చిందంటే?

మాలి దేశంలో ఈమెయిల్ డొమైన్‌ను నిర్వహిస్తున్న డచ్ ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు జోహన్నెస్ జుర్బియర్ ఈ సమస్యను మొదట వెలుగులోకి తెచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని జుర్బియర్ యూఎస్ దృష్టికి తీసుకెళ్లారు. మాలిలోని డిఫెన్స్ అటాచ్, యూఎస్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సర్వీస్, వైట్ హౌస్‌ సీనియర్ సీనియర్ సలహాదారుతో సహా సీనియర్ సిబ్బందితో జుర్బియర్ ఈ విషయాన్ని కులంకుశంగా వివరించారు. ఇప్పటి వరకు తాను 1,17,000 ఈమెయిల్స్ రికవరీ చేశానని, గత బుధవారం ఒక్కరోజే 1,000 సందేశాలను సేకరించినట్లు జుర్బియర్ పేర్కొన్నారు. ఈమెయిల్స్‌ను అమెరికా శత్రువులు అవకాశంగా మలుచుకోవచ్చని యూఎస్ అధికారులకు ఒక లేఖ ద్వారా వివరించారు.