సూడాన్ సంక్షోభం: డ్రోన్ దాడిలో 43మంది మృతి
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు దక్షిణంగా ఉన్న బహిరంగ మార్కెట్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 43మంది చనిపోయారు. ఈ దాడిలో 55 మందికి పైగా గాయపడ్డారని సూడాన్ డాక్టర్స్ యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులను బషైర్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. సుడాన్ దేశంలో మిలిటరీ చీఫ్, పారామిలిటరీ బలగాల చీఫ్ మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య పరస్పర దాడులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ దాడికి సైన్యానికి వైమానిక దళం కారణమని ఆర్ఎస్ఎఫ్ ఆరోపించింది. అయితే తాము ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయలేదని సైన్యం ప్రకటించింది. ఆర్ఎస్ఎఫ్ ఆరోపణలను ఖండించింది.