
ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఆదివారం కాల్పులు జరిపాడు.
దీంతో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
ఇజ్రాయెల్- ఈజిప్టు మధ్య సరిహద్దు వివాదం ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు కాల్పులు జరిపిన వ్యక్తిని చుట్టుముట్టాయి. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నాయి.
గాయపడిన ఇజ్రాయిల్ పర్యాటకుడిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాల్పులు జరిపిన ప్రదేశంలోని దృశ్యాలు
إقروا الفاتحة لأبو العبااااااس.. اسكندرية يا اجدع ناااس يا اجدع نااااس pic.twitter.com/XWcGm6IvJp
— أحمد سامح (@AhmedSamehAhly) October 8, 2023