LOADING...
Trump Tariffs: అక్టోబర్ 14 నుంచి అమల్లోకి.. కలప, ఫర్నిచర్‌పై సుంకాలు
అక్టోబర్ 14 నుంచి అమల్లోకి.. కలప, ఫర్నిచర్‌పై సుంకాలు

Trump Tariffs: అక్టోబర్ 14 నుంచి అమల్లోకి.. కలప, ఫర్నిచర్‌పై సుంకాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు. ఈ ప్రకటనతో ఫర్నిచర్, కలప పై భారీ సుంకాలు విధించబడ్డాయి. ఇటీవల ట్రంప్ కిచెన్ క్యాబినెట్‌లు, బాత్‌రూమ్ పరికరాలు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం కలపపై 10 శాతం, కిచెన్ క్యాబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి.

Details

భారీ స్థాయిలో సుంకాలు

చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా అమెరికాలో ఫర్నిచర్ వ్యాపార కేంద్రంగా ఉన్న నార్త్ కరోలినా ప్రాభవాన్ని కోల్పోయిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఫర్నిచర్ తయారీని కొనసాగించకపోతే ఆయన భారీస్థాయిలో సుంకాలను విధిస్తానని ట్రూత్‌ సోషల్‌లో హెచ్చరించారు. అదేవిధంగా, సిమాలపై కూడా భారీ సుంకాలను ప్రకటించారు. యూఎస్ వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ ప్రకటించడం భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుందని సూచిస్తున్నారు.