LOADING...
Russia: రష్యాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు! 

Russia: రష్యాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. సఖాలిన్ ఒబ్లాస్ట్ ప్రాంతంలో ఉన్న సెవెరో-కురిల్స్క్ సమీపంలో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్టు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. అక్కడి స్థానిక సమయానుసారం ఉదయం 10:49 గంటలకు,భూకంప కేంద్రం భూమి అంతర్భాగంలో 126 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూకంపం సంభవించగానే భయంతో స్థానికులు బయటకు పరుగులు తీసినట్లు సమాచారం.అయితే ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టం గురించి అధికారిక సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఇదే సమయంలో ఇండోనేషియాలో కూడా మరోసారి భూకంపం నమోదు అయింది. సులవేసి ద్వీప ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూమి కదలికలు నమోదైనట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) ప్రకటించింది. బుధవారం ఉదయం సులవేసి ఉత్తర తీరంలో ఈ భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

వివరాలు 

రెండవ పెద్ద భూకంపం

ఇదే వారంలో నమోదైన రెండవ పెద్ద భూకంపం అని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం ఏర్పడిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. గత వారం మాత్రం మలుకు దీవులకు సమీపంగా ఉన్న బండా సముద్రంలో 6.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం దాదాపు 137 కిలోమీటర్ల లోతులో నమోదైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యాలో భారీ భూకంపం