
Japan Earth quake: జపాన్ లో 6.5 తీవ్రతతో భూకంపం
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ (Japan)లో తీవ్ర భూకంపం (Earth Quake)వచ్చింది. సుమారు 6.5 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది.
ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎన్‌జీఎస్)(United States Geological Survey) శనివారం వెల్లడించింది.
జపాన్ లోని బోనిన్ దీవుల్లో భూకంపం సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రం503.2 కి.మీ (312 మైళ్ల)లోతులో ఉందని వెల్లడించింది.
ఈ భూకంపం సాయంత్రం 5.36 నిమిషాలకు వచ్చినట్లు యూఎన్‌జీఎస్ తెలిపింది. అయతే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని కూడా పేర్కొంది.
ఈ భూకంపంతో పాటు టోక్యోలో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు తెలిపింది.
అయితే జపాన్ కు భూ కంపాలు కొత్తేమీ కాదని ఈ ఏడాది తొలిరోజు 7.6 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్ లో 6.5 తీవ్రతతో భూకంపం
An #earthquake of magnitude 6.5 struck #Japan's #BoninIslands, the United States Geological Survey (USGS) said on Saturday. https://t.co/Kh9tT4349x
— ANews (@anews) April 27, 2024