తదుపరి వార్తా కథనం

Ecuador : ఈక్వెడార్ లో టూరిస్టులను చంపిన గ్యాంగ్ స్టర్లు
వ్రాసిన వారు
Stalin
Mar 31, 2024
01:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఈక్వెడార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఈక్వెడార్ లో గ్యాంగ్ స్టర్లు ఐదుగురు పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు.
దక్షిణ ఈక్వెడార్ లోని ఆయంపే బీచ్ పట్టణంలో దాదాపు 20మంది దుండగులు ఓ హోటల్ పై దడి చేశారు.
ఈఘటనలో ఆరుగురిని కిడ్నాప్ చేశారని స్థానిక పోలీసులు తెలిపారు.కిడ్నాప్ చేసిన వారిని డ్రగ్స్ ముఠా సభ్యులుగా భావించి హత్య చేసినట్లు పోలీసులు తెలియజేశారు.
ఈకేసులో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేశామని, మిగిలిన దాడికి పాల్పడిన వారి కోసం ప్రభుత్వం ఆరా తీస్తోందని అధ్యక్షుడు డేనియల్ నోబోవా తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదుగురు పర్యాటకులను కాల్చి చంపిన గ్యాంగ్ స్టర్లు
Ecuador Gangsters Kidnap, Kill 5 Tourists Mistaking Them As Rival Gang Members https://t.co/ZksQYGUMDW pic.twitter.com/cThdsxGPM4
— NDTV (@ndtv) March 31, 2024