Train collision: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి, 100 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈజిప్ట్'లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గిజా నగర సమీపంలోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పలు రైలు బోగీలు పట్టాలు తప్పి కాలువలో పడిపోయాయి. ఈ విషయాన్ని దేశ రైల్వే అథారిటీ వెల్లడించింది. అల్ అయ్యత్ జిల్లా నుంచి ఫయూమ్‌కు వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలును.. కైరో నుంచి అస్వాన్‌కు ప్రయాణిస్తున్న మరో రైలు వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో పలు బోగీలు పట్టాలు తప్పి కాలువలోకి జారిపడ్డాయి.సమాచారం అందుకున్న అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడంతోపాటు సహాయక చర్యలు చేపట్టాయి.
వివరాలు
గతేడాది కూడా రైలు ప్రమాదం
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
ప్రమాదానికి గల కారణాలపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అధికారులను ఆదేశించారు.
కాగా, ఇదే జిల్లాలో గతేడాది కూడా రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకోపైలట్‌తో పాటు ఆయన సహాయకుడు గాయపడ్డారు. తాజాగా జరిగిన ఘోర ప్రమాదంపై ఈజిప్ట్‌లో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తడంతో రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఆదివారం పలువురు డిమాండ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈజిప్టులో రైలు ప్రమాద దృశ్యాలు
SCENES 🇪🇬 Two trains collided Sunday in Egypt killing seven and injuring more than 100 https://t.co/I5zUuztgNR pic.twitter.com/ZKlgSpoiaw
— ShanghaiEye🚀official (@ShanghaiEye) November 8, 2026