NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Elon Musk : హమాస్ ఉగ్రవాదులపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..వారిని చంపడం సబబే
    తదుపరి వార్తా కథనం
    Elon Musk : హమాస్ ఉగ్రవాదులపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..వారిని చంపడం సబబే
    హమాస్ ఉగ్రవాదులపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..వారిని చంపడం సబబే

    Elon Musk : హమాస్ ఉగ్రవాదులపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..వారిని చంపడం సబబే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 28, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెదవి విరిచారు.

    ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16వేల మందికిపైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పరిణామాలపై చర్చలు సాగించారు.

    భేటీలో హమాస్ ఉగ్రవాదులను ఏరివేయడం తప్ప ఇంకో మార్గం లేదని ఎలాన్ మస్క్ కుండబద్దలు కొట్టారు.

    ఈ క్రమంలోనే కొత్త తరం ప్రజలు ఉగ్రవాదం వైపు మళ్లకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరారు.

    తాను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూతో మాట్లాడానని, గాజాలో మూడు విషయాలు జరగాలన్నారు. పౌరులను హత్య చేయాలుకునే వారిని పట్టుబట్టి చంపడం తప్ప వేరే మార్గం లేదని నిర్థారణకు వచ్చారు.

    details

    కొత్త వారు అలా కాకుండా చర్యలు చేపట్టాలని మస్క్ సూచన

    కొత్త తరం ప్రజలు హంతకులుగా మారకుండా ప్రజల మధ్య శ్రేయస్సును నిర్మించడం ముఖ్యమని రెండో విషయంగా పేర్కొన్నారు.

    అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కిబ్బట్జ్ క్ఫర్ అజా పర్యటనపైనా మాట్లాడారు.

    తమ దగ్గరి, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు మానసికంగా కష్టతరమైన రోజు అన్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో భేటీ సందర్భంగా హమాస్ చేతిలో ఉన్న బందీల కుటుంబాలతో మస్క్ సమావేశమయ్యారు.

    బందీల్లో భాగంగా ఓ బాధిత తండ్రి, మస్క్'కు సింబాలిక్ డాగ్ ట్యాగ్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై ' మా హృదయాలు గాజాలో బందీలుగా ఉన్నాయి' అని రాసి ఉంది. గాజాలోని బందీలు విడుదలయ్యే వరకు ఈ ట్యాగ్ ప్రతీ రోజు ధరిస్తానని మస్క్ బదులిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెస్లా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టెస్లా

    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం భారతదేశం
    రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు ఎలాన్ మస్క్
    టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ!  ఆటో మొబైల్
    కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025