LOADING...
Elon Musk: ఎపిస్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ పేరు
ఎపిస్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ పేరు

Elon Musk: ఎపిస్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ పేరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్, టెక్ పరిశ్రమ అధిపతి 'ఎలాన్ మస్క్' పేరు అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. దీనికి కారణం 'జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్' లో మస్క్ పేరు కనిపించడమే. ఈ ఫైల్స్‌లో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ లాంటి ప్రముఖుల పేర్లు కూడా ఉండడం తెలిసిందే. మరికొంత మంది వాదనల ప్రకారం, ట్రంప్ తన భార్య 'మెలానియా'ను కూడా ఎపిస్టీన్ పరిచయం చేశాడని చెబుతున్నారు. 2003లో ఎపిస్టీన్ పుట్టిన రోజు కానుకగా ఒక లేఖ రాశాడన్న అంశం కూడా WSJ లో కథనం అయ్యింది. ఇప్పటికే డెమోక్రటిక్ చట్ట సభ్యులు మరో కొత్త పత్రాన్ని విడుదల చేశారు.

Details

తనపై వస్తున్న కథనాలు అవాస్తవం

ఆరు పేజీల నివేదికలో 2014లో ఎలాన్ మస్క్ వర్జిన్ దీవులలోని ఎపిస్టీన్ ద్వీపానికి వెళ్లారని, అక్కడ కొంతమంది మహిళలు తమను దుర్వినియోగం చేశారని తెలిపారు. అయితే, దీనిపై మస్క్ ఎక్స్ప్లిసిట్‌గా ఖండిస్తూ, తనపై వస్తున్న కథనాలు అవాస్తవమని ఎక్స్ (Twitter) లో పోస్ట్ చేశారు. డెమోక్రాట్లు విడుదల చేసిన ఎపిస్టీన్ క్యాలెండర్ కాపీలలో ఫిబ్రవరి 16, 2019న అధ్యక్షుడు ట్రంప్ మిత్రుడు 'స్టీవ్ బానన్'తో బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు పేర్కొనబడింది. అలాగే డిసెంబర్ 5, 2014న బిల్ గేట్స్ అల్పాహారం చేసినట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అవాస్తమన్న ఎలాన్ మస్క్