LOADING...
Ontario warehouse: కింబర్లీ-క్లార్క్ గోదాంకి నిప్పు పెట్టిన ఉద్యోగి .. వీడియో ఇదిగో! 
కింబర్లీ-క్లార్క్ గోదాంకి నిప్పు పెట్టిన ఉద్యోగి .. వీడియో ఇదిగో!

Ontario warehouse: కింబర్లీ-క్లార్క్ గోదాంకి నిప్పు పెట్టిన ఉద్యోగి .. వీడియో ఇదిగో! 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఓ ఉద్యోగి చేసిన నిర్లక్ష్య చర్యతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీతం సరిపోవడం లేదన్న అసంతృప్తో లేక బాస్ పై కోపమో.. ఓ ఉద్యోగి గోదాంలోని టాయిలెట్ పేపర్ బండిళ్లకు నిప్పు పెట్టడంతో మొత్తం కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది. Kimberly-Clark సంస్థకు చెందిన గోదాంలో ఈ ఘటన జరిగింది. Ontario, Californiaలో మంగళవారం తెల్లవారుజామున చామెల్ అబ్దుల్ కరీం (29) అనే ఉద్యోగి లైటర్‌తో టాయిలెట్ పేపర్ బండిళ్లకు నిప్పుపెట్టాడు. ఈ చర్యను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. గోదాంలో ఎక్కువగా పేపర్ ఉత్పత్తులు నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లోనే విస్తరించాయి.

వివరాలు 

టాయిలెట్ పేపర్, టిష్యూల సరఫరాపై ప్రభావం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దీనిని '6-అలారం ఫైర్'గా ప్రకటించారు. దాదాపు 175 ఫైరింజన్లు, వందలాది సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పరిస్థితి అదుపుతప్పింది. సుమారు 1.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గోదాం పైకప్పు కూలిపోయి, లోపలున్న సరుకంతా బూడిదైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 20 మంది ఉద్యోగులు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన చామెల్ అబ్దుల్ కరీంను పోలీసులు అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అమెరికా వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో టాయిలెట్ పేపర్, టిష్యూల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోపంతో చేసిన పని.. లక్షల చదరపు అడుగుల గోదాం నాశనం

Advertisement