
US-EU Trade War: అమెరికా వస్తువులపై $23 బిలియన్ల సుంకాలను విధించిన ఐరోపా..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అనేక దేశాలపై పరస్పర సుంకాలు (టారిఫ్‌లు) విధించారు.
ముఖ్యంగా ఐరోపా దేశాల నుండి దిగుమతి అయ్యే ఉక్కు,అల్యూమినియం ఉత్పత్తులపై సుమారు 25 శాతం శాతం సుంకాన్ని విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
దీనికి ప్రతిగా యూరోపియన్ యూనియన్ (EU) కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఆ సమావేశంలో చర్చలు జరిగిన అనంతరం, అమెరికా నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 23 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలు విధించేందుకు అంగీకారాన్ని ప్రకటించింది.
ఈ నిర్ణయానికి యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలూ అనుమతి ఇచ్చాయి.
వివరాలు
ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15, డిసెంబర్ 1 నుంచి దశల వారీగా అమలు..
ఈ ప్రతీకార సుంకాలు మూడు దశల్లో అమలులోకి రానున్నట్లు EU పేర్కొంది.అంటే ఏప్రిల్ 15, మే 15, డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
అయితే,ఏయే అమెరికన్ ఉత్పత్తులపై ఈ సుంకాలు వర్తిస్తాయో అన్న వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఈనేపథ్యంలో,వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూసుకోవాలన్న దృష్టితో,సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఐరోపా దేశాలకు చెందిన ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలను అన్యాయమైనవిగా ఐరోపా దేశాలు అభివర్ణించాయి.
ఇటువంటి చర్యలు రెండు పక్షాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వారు చెబుతున్నారు.
అంతేకాక,ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థకూ నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక కమిషన్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.