
హమాస్ పై ప్రధాని నెతాన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ప్రతీ హమాస్ సభ్యుడు చచ్చినోడితో సమానమే
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నేతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు.ఈ మేరకు హమాస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.
బుధవారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.గాజాలో అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో దాడులు చేపడతామన్నారు.
అసలు ఈ భూమ్మీదనే హమాస్ గ్రూప్ ఉనికి లేకుండా చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ క్రమంలోనే ప్రతి హమాస్ సభ్యుడు భారీగా మూల్యం చెల్లించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. అసలు వాళ్లు మనుషులు కాదు, వారిని నలిపేస్తామంటూ ఆగ్రహించారు.
ఇకపై ప్రతీ హమాస్ సభ్యుడు సచ్చినోడితో సమానమని నెతన్యాహు స్పష్టం చేశారు.
వేలాది ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉరుకునేది లేదని బైడన్ హెచ్చరించారు. హమాస్‌ను భూస్థాపితం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లంట్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రతీ హమాస్ సభ్యుడు చచ్చినోడితో సమానమే : నెతన్యాహు
Netanyahu: Every Member of Hamas is a Dead Man pic.twitter.com/ZrzzMPH5ju
— SuzeeB🙂 (@NatalieSuB) October 12, 2023