LOADING...
Southwest flight: గగనతలంలో ఉత్కంఠ.. విమానానికి ఎదురుగా వెళ్లిన ఫైటర్ జెట్!
గగనతలంలో ఉత్కంఠ.. విమానానికి ఎదురుగా వెళ్లిన ఫైటర్ జెట్!

Southwest flight: గగనతలంలో ఉత్కంఠ.. విమానానికి ఎదురుగా వెళ్లిన ఫైటర్ జెట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం, శుక్రవారం జరిగిన గగనతల ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ బర్‌బ్యాంక్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఈ విమానం గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో హాకర్ హంటర్ అనే యుద్ధ విమానం దానికి ఎదురుగా వచ్చి పడింది. ఈ అప్రమత్తమైన పైలట్లు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో విమానాన్ని అత్యవసరంగా 500 అడుగుల మేర కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ హఠాత్ మానవచర్య వల్ల విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు సహాయకులు స్వల్పంగా గాయపడ్డారు.

Details

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

ఈ విషయాన్ని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం దృశ్యాలను విమానాల ట్రాకింగ్‌కు ప్రసిద్ధి చెందిన వెబ్‌సైట్‌ 'Flightradar24' సామాజిక మాధ్యమాల్లో వీడియో రూపంలో షేర్ చేసింది. వీడియోలో 14,100 అడుగుల ఎత్తులో ఉన్న విమానం, హాకర్ హంటర్ ఎదురుగా వస్తున్న దృశ్యాన్ని గమనించగలిగింది. వెంటనే విమానం 13,625 అడుగుల మేర కిందికి దించబడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని నివారించడంలో టీసీఏఎస్‌ (TCAS - Traffic Collision Avoidance System) కీలకంగా పనిచేసింది. రెండు విమానాలు దగ్గరగా వచ్చిన వెంటనే అలర్ట్ ఇచ్చిందని అధికారులు తెలిపారు. అలర్ట్ రావగానే పైలట్లు వేగంగా స్పందించగలగడం వల్లే ప్రమాదం తప్పిందన్నారు.

Details

ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అధికారులు

అనంతరం విమానం తన గమ్యస్థానానికి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇది కొత్తది కాదని విమానయాన పరిశ్రమ వర్గాలు గుర్తుచేశాయి. ఇటీవల మిన్నియాపొలిస్ నుంచి మైనట్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం కూడా బీ-52 బాంబర్ యుద్ధ విమానానికి ఎదురుగా వచ్చి ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. ఆ సందర్భంలో డెల్టా పైలట్ స్పందిస్తూ యుద్ధ విమానం ఎదురుగా వస్తుందన్న హెచ్చరిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అంత స్పష్టంగా రాలేదని వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనలు వాణిజ్య విమానయాన భద్రతపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.