తదుపరి వార్తా కథనం

Iran Port Fire: ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 27, 2025
01:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని ఓ ఓడరేవులో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 25 మంది మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
750 మంది తీవ్రంగా గాయపడ్డారని కూడా వెల్లడించారు. ఈ ఘటన దక్షిణ ఇరాన్‌లోని అతిపెద్ద నౌకాశ్రయ సమీపంలో జరిగింది.
పేలుడు ధాటికి సమీప భవనాల అద్దాలు ధ్వంసమై, ఒక భవనం నేలకూలింది.
Details
దర్యాప్తు కొనసాగుతోంది
దట్టమైన నల్లటి పొగ వ్యాపించడంతో, సమీపంలోని పాఠశాలలు, కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు.
ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వివరణ ఇచ్చారు.
ఇది దాడి కాదని, పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లలో పేలుడు జరిగిందని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రమాదం కారణాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.