LOADING...
Switzerland: స్విట్జర్లాండ్ బార్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి..! 
స్విట్జర్లాండ్ బార్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి..!

Switzerland: స్విట్జర్లాండ్ బార్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

నూతన సంవత్సర సంబరాల వేళ స్విట్జర్లాండ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పేరొందిన స్కీ రిసార్ట్ ప్రాంతమైన క్రాన్స్‌ మోంటానా పట్టణంలో ఉన్న ఒక బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్థానిక అధికారుల వివరాలను ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే, మరో వంద మందికి పైగా గాయాల పాలైనట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక నిర్ధారణ వెలువడలేదు. బార్‌లో నూతన సంవత్సర వేడుకలు జోరుగా కొనసాగుతున్న సమయంలో, అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో (స్థానిక సమయం ప్రకారం) ఈ పేలుడు చోటుచేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్విట్జర్లాండ్ బార్‌లో భారీ పేలుడు

వివరాలు 

ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి నెలల్లో ఇక్కడికి భారీగా పర్యాటకులు

పేలుడు తీవ్రత కారణంగా అక్కడ భారీగా అగ్నిప్రమాదం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం లేదని అధికారులు స్పష్టం చేశారు. బాణసంచా వలన ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. స్విస్ ఆల్ప్స్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న క్రాన్స్‌ మోంటానా పట్టణం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి నెలల్లో ఇక్కడికి భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న సమాచారం కూడా ఉంది.

Advertisement