LOADING...
Israel: ఇజ్రాయెల్‌ నూతన సైన్యాధిపతిగా ఇయల్‌ జమీర్‌ 
ఇజ్రాయెల్‌ నూతన సైన్యాధిపతిగా ఇయల్‌ జమీర్‌

Israel: ఇజ్రాయెల్‌ నూతన సైన్యాధిపతిగా ఇయల్‌ జమీర్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ కొత్త సైన్యాధిపతిగా మాజీ మేజర్‌ జనరల్‌ ఇయల్‌ జమీర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు దేశ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ ఆర్మీ కొత్త చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఇయల్‌ జమీర్‌ నియమితులయ్యారు. ఆయనను ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, రక్షణ మంత్రి కాట్జ్‌లు సంయుక్తంగా ఎంపిక చేశారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. హమాస్‌ దాడుల నేపథ్యంలో మార్పు 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రదాడుల కారణంగా టెల్‌అవీవ్‌లో 1,200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మిలిటెంట్‌ దాడిని అడ్డుకోవడంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నందుకు బాధ్యత వహిస్తూ, ఇజ్రాయెల్‌ సైన్యాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌) లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జీ హలేవీ తన పదవికి రాజీనామా చేశారు.

Details

ఇజ్రాయెల్ సైన్యంలో జమీర్ కు 28 ఏళ్ల అనుభవం

మార్చి 6న అధికారికంగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు హలేవీ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కొత్త సైన్యాధిపతిగా ఇయల్‌ జమీర్‌ను నియమించింది. ఈ సందర్భంగా హలేవీ కొత్త చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జమీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జమీర్‌ ఇజ్రాయెల్‌ సైన్యంలో 28 ఏళ్ల అనుభవం కలిగిన అధికారి. 2018నుంచి 2021 వరకు మిలిటరీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. దక్షిణ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఇది గాజా సరిహద్దు సహా కీలక సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే విభాగం. గతంలో ప్రధాని నెతన్యాహుకు సైనిక కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇజ్రాయెల్‌ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఇయల్‌ జమీర్‌ కీలక భూమిక పోషిస్తారనే అంచనాలు ఉన్నాయి.