USA: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం.. విమాన సేవల్లో 10 శాతం కోత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై పడనుంది.ఈ విషయం గురించి ఆ దేశ రవాణాశాఖ మంత్రి సీన్ డఫీ ప్రకటన చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈ నూతన నిర్ణయం శుక్రవారం నుండి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఎక్కువగా రద్దీ ఉండే 40 ప్రముఖ విమానాశ్రయాల్లో సుమారు 10 శాతం విమాన సర్వీసులను నిలిపివేయనున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య తగ్గడంతో, వారిపై పెరుగుతున్న పని భారం తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
వివరాలు
1800 విమాన సర్వీసులపై ప్రభావం
పరిస్థితి ఇంకా క్షీణిస్తే, వీటితో పాటు ఇంకా కఠినమైన పరిమితులను అమలు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నిర్ణయంతో మొత్తం 1,800 విమాన సర్వీసులు నేరుగా ప్రభావితమవుతాయని అంచనా. అయితే, అంతర్జాతీయ విమానాల సర్వీసులపై ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుందన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా, అంతరిక్ష ప్రయోగాల వ్యవహారంలో కూడా ఎఫ్‌ఏఏ కొంత మార్పులు చేయవచ్చని సూచనలు వెలువడ్డాయి.