US Election 2024: అమెరికా ఎన్నికల్లో చివరిరోజు ఈక్వల్ టైమ్ వివాదానికి ముగింపు.. ట్రంప్‌కు సమయం కేటాయించిన ఎన్‌బీసీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 సమీపిస్తున్న సందర్భంలో, కమలా హారిస్‌ను ప్రస్తావిస్తూ ప్రసారమైన Saturday Night Live (ఎస్‌ఎన్‌ఎల్) షోపై వివాదం రాజుకుంది. హారిస్ పాత్రను కమెడియన్ మాయా రూడాల్ఫ్ పోషించగా, నిజ జీవితంలో కమలా హారిస్ కూడా ఆ షోలో పాల్గొన్నారు. ఈ సమయంలో, ఎన్‌బీసీ పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ట్రంప్ వర్గీయులు విమర్శలు గుప్పించారు. ఎఫ్‌సీసీ కమిషనర్ బ్రాండన్ కార్ ఈ ఘటనను 'ఈక్వల్ టైమ్ రూల్' ఉల్లంఘనగా అభివర్ణించారు.
ఈక్వల్ టైమ్ నిబంధన ఎందుకు?
1934లో కమ్యూనికేషన్ యాక్ట్ ప్రకారం, ప్రసార సంస్థలు ఒక అభ్యర్థికి ఎన్ని నిమిషాలు ప్రసారం కేటాయిస్తాయో, అదే సమయాన్ని ప్రత్యర్థి అభ్యర్థికి కూడా ఇవ్వాలి. ఎన్నికల సమయంలో పబ్లిక్ ఎయిర్‌వేవ్స్ వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఇబ్బందుల పరిష్కారం ఎన్‌బీసీ చానల్ ఎట్టకేలకు ఈ నిబంధనకు అనుగుణంగా ట్రంప్‌కి కూడా 90 సెకన్ల ప్రసార సమయం కేటాయించింది. ఈ సమయంలో ట్రంప్ తన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' సందేశాన్ని, టోపీ ధరించి, తన అభిమానులకు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ చర్యతో వివాదం కొంతమేరకు సద్దుమణిగింది.