Birthright citizenship: ట్రంప్‌కు మరో షాక్.. జన్మతః పౌరసత్వం కొత్త ఉత్తర్వులపై కోర్టు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జన్మతః పౌరసత్వం విషయంలో మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం లభించే విధానాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్ తీసుకొచ్చిన తాజా కార్యనిర్వాహక ఉత్తర్వుల అమలును ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది మరో న్యాయపరమైన అడ్డంకిగా మారింది. బర్త్ టూరిజాన్ని అడ్డుకోవడంతో పాటు,కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అమెరికాలో జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఆగస్టు 6న కొత్త ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా పౌరులు కాని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల విషయంలో పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేయాలని ఈ ఆదేశాల్లో ప్రతిపాదించారు.
వివరాలు
కోర్టును ఆశ్రయించిన ప్రభావిత కుటుంబాలు
విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోకి వచ్చి ప్రసవించడం 'బర్త్ టూరిజం'గా పిలుస్తారు.
ఈ ఉత్తర్వులపై వలసదారుల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు, ప్రభావిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు, ఇప్పటికే ఉన్న సుప్రీంకోర్టు తీర్పులకు ట్రంప్ తాజా ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయని వారు వాదించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న మేరీల్యాండ్ ఫెడరల్ జిల్లా న్యాయమూర్తి డెబోరా ఎల్. బోర్డ్‌మన్ ప్రాథమిక నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ఈ ఉత్తర్వుల ఆధారంగా పిల్లల పౌరసత్వాన్ని తిరస్కరించడం లేదా ప్రశ్నించడం నుంచి సంబంధిత ఫెడరల్ సంస్థలకు అడ్డుకట్ట పడింది.
వివరాలు
నిర్దిష్ట వర్గాల పిల్లలే లక్ష్యంగా కొత్త ఉత్తర్వులు
జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలకు ఇంతకుముందే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు,వారి తల్లిదండ్రుల పౌరసత్వం లేదా వలస స్థితిని బట్టి విస్తృతంగా పౌరసత్వాన్ని నిరాకరించే ట్రంప్ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
14వ రాజ్యాంగ సవరణలోని పౌరసత్వ హక్కులకు ఈ విధానం విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
అయితే సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కూడా ట్రంప్ ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట వర్గాల పిల్లలను లక్ష్యంగా చేసుకునేలా కొత్త ఉత్తర్వులను తీసుకొచ్చింది.
వివరాలు
నిర్దిష్ట వర్గాల పిల్లలే లక్ష్యంగా కొత్త ఉత్తర్వులు
ముఖ్యంగా బర్త్ టూరిజం, విదేశీ ప్రభుత్వాలతో సంబంధాలున్న తల్లిదండ్రులు, పౌరసత్వం పొందేందుకు మోసపూరిత లేదా వాణిజ్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు భావించే సందర్భాలను ఈ ఆదేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి.
తాజా ఫెడరల్ కోర్టు తీర్పుతో ఈ కొత్త విధానం అమలుకు కూడా ప్రస్తుతానికి బ్రేక్ పడింది.