Indonesia: బాలి సమీపంలో ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 25 మంది
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలోని బాలి సమీపంలో ప్రయాణికుల ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో 25 మంది మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 131 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు 106 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఫెర్రీలో ఇంకా చిక్కుకున్న 25 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు. గాలింపు, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు.
వివరాలు
ఫెర్రీలో ప్రయాణికులతో పాటు 44 వాహనాలు, 53 మోటారు సైకిళ్లు
బాలి ప్రాంతంలోని పడాంగ్ బాయి పోర్టు నుంచి లెంబార్ పోర్టుకు ఫెర్రీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో ఫెర్రీలో ప్రయాణికులతో పాటు 44 వాహనాలు, 53 మోటారు సైకిళ్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మంటలు చెలరేగడానికి గల కారణాలను గుర్తించే పనిలో సంబంధిత అధికారులు ఉన్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బాలి సమీపంలో ఫెర్రీలో అగ్నిప్రమాదం.. రంగంలోకి హెలికాప్టర్
Un ferry de pasajeros se incendió en aguas frente a la isla de Lombok, Indonesia, con unas 130 personas a bordo, según informaron las autoridades locales. pic.twitter.com/MMQgYxd7EH
— aapayés (@aapayes) August 12, 2026