LOADING...
Brazil: టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు!
టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు!

Brazil: టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. లాటమ్ ఎయిర్‌లైన్స్ (LATAM Airlines) కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కి సిద్ధమవుతున్న సమయంలో క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దిగించారు. ఈ ఘటనలో విమానంలో పెద్దఎత్తున మంటలు, పొగ వ్యాపించగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకున్నారు.

Details

ఎవరికీ గాయాలు కాలేదు

ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు ధృవీకరించారు. లాటమ్ ఎయిర్‌లైన్స్ వివరణ ప్రకారం.. "విమానంలో మంటలు చెలరేగలేదని, అసలు అగ్ని ప్రమాదం లగేజీ లోడర్‌లో చోటుచేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించామని వెల్లడించింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి, ప్రయాణికులు సురక్షితంగా బయటకు రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement