LOADING...
Fire engulfs Copenhagen's Stock Exchange: డెన్మార్క్ లోని కోపెన్హగెన్ ఓల్ట్ స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
డెన్మార్క్ లోని కోపెన్హగెన్ ఓల్ట్ స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Fire engulfs Copenhagen's Stock Exchange: డెన్మార్క్ లోని కోపెన్హగెన్ ఓల్ట్ స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

వ్రాసిన వారు Stalin
Apr 16, 2024
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

డెన్మార్క్ (Denmark)లోని కోపెన్ హాగెన్ (Copenhagen) లోని పాత స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో పై రూఫ్ అగ్నికీలలకు తగలబడి కూలిపోయింది. అయితే అగ్ని ప్రమాదం లో ఎవరూ గాయపడలేదని ఇప్పటివరకు ఉన్న సమాచారం. చారిత్రాత్మక కట్టడమైన ఈ భవనంలో ఉన్న పెద్ద పెద్ద పెయింటింగ్స్ ను మంటలనుంచి కాపాడేందుకు స్థానికులు బయటకు తీసుకెళ్తున్న విజువల్స్ ను అక్కడి మీడియా ప్రసారం చేస్తోంది. ఈ చారిత్రాత్మక భవనం నాలుగు చివరి గోపురాలు ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ప్రస్తుతం ఈ భవనం పునర్మాణ దశలో ఉండగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Fire accident-Denmark

ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు...

అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలికి చేరుకున్నారు. వీరితో పాటు అగ్నిమాపక దళాలు కూడా అక్కడుకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యలను రెస్క్యూ టీమ్ ప్రారంభించింది. ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అగ్ని కీలలు ఎగిసి పడుతుంటడంతో కోపెన్ హెగెన్​ నగరంలోకి ఎవరూ డ్రైవింగ్ చేసుకుంటూ రావొద్దని పోలీసులు హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఓల్ట్ స్టాక్ ఎక్చేంజ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం