LOADING...
American Airlines plane: టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

American Airlines plane: టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి మియామీకి బయలుదేరే సమయంలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. టేకాఫ్ సందర్భంగా విమాన ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వేపైనే మంటలు చెలరేగాయి, పొగ వ్యాపించింది. దీనిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానాన్ని ఆపేశారు. తక్షణ చర్యల్లో భాగంగా అత్యవసర ద్వారాలను ఉపయోగించి విమానంలోని 173 మంది ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మియామీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా గగనయానాన్ని కొనసాగించలేకపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 వైరల్ అవుతున్న వీడియో