తదుపరి వార్తా కథనం

Japan wild fire: జపాన్‌లో కార్చిచ్చుల బీభత్సం.. వందలాది ఇళ్లు ఖాళీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 24, 2025
04:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ పశ్చిమ ప్రాంతంలో రెండు భారీ కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ కార్చిచ్చుల కారణంగా పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి, వేలాది చెట్లు కాలిపోయాయి.
భయానక పరిస్థితుల మధ్య వందలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఇవాహరి నగరంలోని ఎహిమ్ ప్రిఫెక్చర్‌లో, కొండవాలుపై ఉన్న చెట్లు కార్చిచ్చుతో భస్మమవుతున్నాయి.
ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి హెలికాప్టర్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Details
కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి రెస్క్యూ టీమ్
మరోవైపు ఒకాయమా నగరంలో ఆదివారం చెలరేగిన కార్చిచ్చు పలు ఇళ్లను నాశనం చేసింది.
పరిస్థితి మరింత దారుణంగా మారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా, ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు.
ప్రస్తుతం కార్చిచ్చును అదుపులోకి తేవడానికి రెస్క్యూ టీమ్స్, ఫైర్ ఫైటర్స్ నిరంతరం కృషి చేస్తున్నారు.