Bishnoi gang: కెనడాలో పంజాబ్ సింగర్ ఇంటిపై కాల్పులు జరిపిన బిష్ణోయ్ గ్యాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) దుశ్చర్యలు పెరుగుతూ పోతున్నాయి. ఆ గ్యాంగ్ సభ్యులు భారత సంతతికి చెందిన వ్యక్తులను వరుసగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల అక్కడ పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి (Darshan Singh Sahasi) హత్యకు గురైన ఘటనకు ఈ గ్యాంగ్‌నే కారణమని ప్రకటించారు. బిష్ణోయ్ గ్యాంగ్‌లోని సభ్యుడు గోల్దీ ధిల్లాన్ (Goldy Dhillon) సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇక తాజాగా పంజాబీ గాయకుడు చాని నట్టన్ (Chani Nattan) ఇంటి వద్ద కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి.
వివరాలు
కేసు నమోదు చేసిన కెనడా స్థానిక పోలీసులు
కెనడాలో జరిగిన ఈ ఘటనకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌నే బాధ్యత వహిస్తున్నట్లు గోల్దీ ధిల్లాన్ తెలిపాడు. గాయకుడు సర్దార్ ఖేరా (Sardar Khehra)తో నట్టన్ పెరుగుతున్న సాన్నిహిత్యం కారణంగానే అతడిని టార్గెట్ చేశామని పేర్కొన్నాడు. ఖేరాతో కలిసి పనిచేసే ఏ గాయకుడినైనా తాము లక్ష్యంగా చేసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ సంఘటనపై కెనడా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.