Russian Diesel to US: అమెరికాకు రష్యా 40 వేల టన్నుల డీజిల్.. బయలుదేరిన తొలి ట్యాంకర్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు రష్యా నుంచి డీజిల్ సరఫరా చేసేందుకు కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చే దిశగా తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా రష్యా నుంచి డీజిల్‌తో కూడిన తొలి ట్యాంకర్ అమెరికాకు బయలుదేరింది. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. త్వరలోనే డీజిల్ సరఫరా ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ నౌక నవంబర్ 7న న్యూయార్క్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఇటీవల ఈ ఒప్పందంపై స్పందిస్తూ.. మొదటి విడతలో భాగంగా 40 వేల టన్నుల డీజిల్‌ను అమెరికాకు సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
వివరాలు
అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టిన జెలెన్‌స్కీ
అమెరికాలో ఇటీవల ఇంధన ధరలు పెరగడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
దీనికి తోడు నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగినట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో ఇంధన ధరలను తగ్గించే చర్యల్లో భాగంగా ట్రంప్ రష్యా నుంచి చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అంగీకరించి ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తప్పుబట్టారు.
బలమైన భాగస్వామి బలహీనమైన నిర్ణయం తీసుకున్నారని, అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ ఆయన విమర్శలు చేశారు.