America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఐదుగురు స్పాట్ డెడ్
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఒక పాఠశాలలో ఓ విద్యార్థి అకస్మాత్తుగా గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ అనూహ్య ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి ఆ తర్వాత తనకు తానే కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
పాఠశాలలో గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు
ఈ ఏడాది మొత్తం 322 కాల్పుల ఘటనలు
తాజా సంఘటనతో అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతిపై చర్చ సాగింది. తుపాకీ నియంత్రణ,పాఠశాలల భద్రత యునైటెడ్ స్టేట్స్‌లో ప్రధాన రాజకీయ,సామాజిక సమస్యగా మారాయి. ఇటీవల కాలంలో అక్కడ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం,ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.