తూర్పు లిబియా: వరదల్లో 2,000 మంది మృతి ,వేలాది మంది గల్లంతు
తూర్పు లిబియాలో భారీ తుఫాను, వర్షం కారణంగా డెర్నా నగరం గుండా భారీ వరదలు సంభవించడంతో కనీసం 2,000 మంది మరణించారని,వేలాది మంది తప్పిపోయారని తూర్పు లిబియాలోని అధికారులు తెలిపారు. తూర్పు లిబియాను నియంత్రించే లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారీ మాట్లాడుతూ, డెర్నా పైన ఉన్న ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు సంభవిచిందని తెలిపారు. ఈ వరద విపత్తులో గల్లంతైన వారి సంఖ్య 5 నుండి 6 వేలమంది దాకా ఉంటుందని ఆర్మీ ప్రతినిధి పేర్కొన్నారు.
డెర్నా నగరంలో తుపాన్ విపత్తుకు దెబ్బతిన్న భవనాలు,రోడ్లు
అంతకుముందు సోమవారం, ఈ ప్రాంతంలోని రెడ్ క్రెసెంట్ సహాయ బృందం అధిపతి డెర్నా మరణాల సంఖ్య 150 వరకు ఉంటుందని అది సుమారుగా 250కి చేరుకుంటుందని అంచనా వేసింది. ట్రిపోలీలో, విభజించబడిన దేశంలో దేశాధినేతగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల అధ్యక్ష మండలి అంతర్జాతీయ సమాజాన్ని సహాయం కోరింది. తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ మాట్లాడుతూ, తూర్పు లిబియాలో 2,000 మందికి పైగా మరణించగా, వేలాది మంది తప్పిపోయారని తెలిపారు. అంతకముందు వారం గ్రీస్ దేశాన్ని ముంచెత్తిన తుపాన్ విపత్తు మధ్యధరా సముద్రంలోకి దుకెళ్లడంతో వరదల వల్ల డెర్నా నగరంలో భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. లిబియాలోని సముద్ర తీరంలోని భవనాలు ధ్వంసం అయ్యాయి.