LOADING...
Iran: 'మీ దేశంపై దృష్టి పెట్టండి': ట్రంప్‌కు ఖమేనీ హెచ్చరిక 
'మీ దేశంపై దృష్టి పెట్టండి': ట్రంప్‌కు ఖమేనీ హెచ్చరిక

Iran: 'మీ దేశంపై దృష్టి పెట్టండి': ట్రంప్‌కు ఖమేనీ హెచ్చరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటుచేసుకున్న అల్లర్లపై దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఆయన ఆందోళనకారులను హెచ్చరిస్తూ, విదేశీ శక్తుల నియంత్రణలో కిరాయి సైనికుల్లా వ్యవహరిస్తున్నవారిని ఎవరు మన్నించరని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ, ఇతర దేశాలపై వ్యాఖ్యలు చేయకముందు సొంత దేశ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందేశాన్ని ఆయన వీడియో ద్వారా ప్రజలకు వెల్లడించారు. సొంత దేశ వీధులను నాశనం చేస్తూ, ఇతర దేశాధ్యక్షుడిని సంతోషపరచే ప్రయత్నం చేస్తున్నవారిని ఆయన ఖండించారు.

వివరాలు 

ఇంటర్నెట్, టెలిఫోన్‌ సేవల నిలిపివేత 

ఇదే సమయంలో, గతంలో అమెరికా మద్దతుతో ఇరాన్‌ను పాలించిన షా వారసుడు యువరాజు రెజా పహ్లావి ఇచ్చిన పిలుపు మేరకు, ఇరాన్‌లోని ఆందోళనకారులు భారీగా రోడ్లకు బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు. గురువారం మొదలైన ఈ నిరసనలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. ఇంటర్నెట్, టెలిఫోన్‌ సేవలను ప్రభుత్వం నిలిపేసినప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే స్పందించిన సుప్రీం లీడర్‌.. యువత ఏకతాటిపై ఉండాలని, దేశం ఐకమత్యంగా ఉన్నప్పుడే ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోవచ్చన్నారు.

Advertisement