
Hamas hostages: 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. నేడు మరికొంత మందికి విముక్తి
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్-ఇజ్రాయెల్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా గాజాలో ఏడు వారాల బందీలుగా ఉన్న 24మందిని హమాస్ విడుదల చేసింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఖతార్ ఈ విషయాన్ని ధృవీకరించింది.
విడుదలైన వారిలో 13మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. 10మంది థాయ్, ఒకరు ఫిలిప్పీన్స్ పౌరులు ఉన్నారు.
గాజా నుంచి ఈజిప్టుకు బందీలను పంపించినట్లు రెడ్ క్రాస్ కూడా పేర్కొంది.
బందీల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. వీరిని ఇజ్రాయెల్‌కు పంపేముందు వైద్య పరీక్షలు చేయనున్నారు.
అనంతరం వారిని వారి కుటుంబ సభ్యులలకు అప్పగిస్తారు.
హమాస్‌తో ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లల్లో ఉన్న 39మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
హమాస్
రెండో విడత జాబితాను ఇజ్రాయెల్‌కు పంపిన హమాస్
నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 50మంది బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది.
ఈ క్రమంలో మొదటి దశలో 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్.. శనివారం మరికొంత మందికి విముక్తి కల్పించనుంది.
ఈ మేరకు శనివారం విడుదల చేయనున్న బందీల జాబితాను ఇజ్రాయెల్‌కు హమాస్ పంపినట్లు ఖతార్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే రెండో విడతలో ఎంతమందిని హమాస్ విడుదల చేస్తుందనే దానిపై స్పష్టమైన సమాచారం తెలియదు.
అలాగే రెండో దశలో ఇజ్రాయెల్ కూడా ఎంత మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుందనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం హమాస్ చేతిలో 200మందికిపైగా బందీలు ఉన్నారు.