Page Loader
world's hottest day: 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. జులై 21న ప్రపంచంలోనే అత్యంత వేడి నమోదు
84 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. జులై 21న ప్రపంచంలోనే అత్యంత వేడి నమోదు

world's hottest day: 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. జులై 21న ప్రపంచంలోనే అత్యంత వేడి నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2024
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత నెల 21న తీవ్రమైన వేడిని ప్రజలు ఎదుర్కొన్నారని, ఇది 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి అని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) ప్రకటించింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 17.09 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. C3S నుండి ప్రాథమిక డేటా ప్రకారం 1940లో అత్యంత వేడి నమోదైంది. 2023 జూలై 6న 17.08 డిగ్రీల సెల్సియస్‌తో గత రికార్డును అధిగమించింది.

Details

ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

జూలై 2023కి ముందు, ఆగస్టు 2016లో భూమి రోజువారీ సగటు ఉష్ణోగ్రత 16.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అయితే, జూలై 3, 2023 నుండి దాదాపు 57 రోజులు ఉష్ణోగ్రతలు మునుపటి రికార్డును మించిపోవడం గమనార్హం. ముందుకంటే 2023, 2024 సంవత్సరాల్లో రోజువారీ ప్రపంచ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని విశ్లేషణ చెబుతున్నారు. గత నెలలో ఐదు ఖండాల్లోని కోట్ల మంత్రి ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ ప్రకటించిన విషయం తెలిసిందే.