LOADING...
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అవినీతి కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌పై తాజాగా అవినీతి కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌, బుష్రా బీబీలకు పాకిస్థాన్‌ న్యాయస్థానం 17 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు అక్కడి మీడియా శనివారం వెల్లడించింది. 2023 నుంచి జైల్లోనే ఉన్న ఇమ్రాన్‌కు ఈ తీర్పు మరో పిడుగులా మారింది. కొద్ది రోజులుగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై తీవ్ర అనుమానాలు, పుకార్లు సోషల్‌మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. జైల్లో ఆయనపై దాడి జరిగిందన్న వదంతులు కూడా వ్యాపించాయి.

Details

అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్

అయితే ఇటీవల ఆయన సోదరి అడియాలా జైలుకు వెళ్లి ఇమ్రాన్‌ను కలవడంతో ఈ పుకార్లకు కొంతవరకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ రావల్పిండి సమీపంలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జైలులో ఆయనను హెపటైటిస్‌తో బాధపడుతున్న ఖైదీలతో కలిసి ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జైలు అధికారులు మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన సోదరీమణులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. తాజా 17 ఏళ్ల శిక్షతో ఇమ్రాన్‌ ఖాన్‌ న్యాయపరమైన ఇబ్బందులు మరింత పెరిగినట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement